GDWL: జమ్మిచేడు జమ్ములమ్మ ఆలయంలో గురువారం అమావాస్య సందర్భంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. అమ్మవారిని కృష్ణా నదీ జలాలతో అభిషేకించి, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం అర్చన, ఆకుపూజ, హోమం నిర్వహించారు. కార్తీక మాసం సందర్భంగా కర్ణాటక, రాయలసీమ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దీపాలు వెలిగించి అమ్మవారిని దర్శించుకున్నారు.