KMM: రఘునాథపాలెంలో కలెక్టర్ అనుదీప్‌తో కలిసి రూ. 1.35 కోట్లతో బాల సదనం నిర్మాణానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీని వారు ప్రారంభించారు. మహిళలు ఆకాశమే హద్దుగా ఎదగాలని, అందుకు ప్రభుత్వం అన్ని విధాలా తోడ్పాటు అందిస్తుందని మంత్రి తుమ్మల తెలిపారు.