NLG: తమ సమస్యల పరిష్కారం కోసం చేనేత కార్మికులు గురువారం ఉదయం చండూరు నుంచి హైదరాబాద్లోని చేనేత కమిషనర్ కార్యాలయానికి బయలుదేరారు. అక్కడ జరిగే ధర్నాలో పాల్గొనడానికి పెద్ద సంఖ్యలో కార్మికులు చేరుకున్నారు. వారికి చేనేత సహకార సంఘం ఛైర్మన్ జూలూరు శ్రీనివాసులు, చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు రాపోలు వెంకటేశం తదితర నాయకులు మద్దతు ప్రకటించారు.