అనంతపురం: రాయదుర్గం పట్టణానికి చెందిన నాయకుల మహేష్ బైక్ యాక్సిడెంట్లో మృతి చెందాడు. బుధవారం అర్ధరాత్రి సిరిగే దొడ్డి సమీపాన స్నేహితులతో కలిసి బైక్పై వస్తుండగా ఆంబోతు అడ్డం వచ్చింది. బైక్ను అదుపు చేయలేక దానిని బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మహేష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.