ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో స్వామివారికి గురువారం అమావాస్య పూజలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి మూలమూర్తికి ఆలయ అర్చకులు, వేద పండితులు సుప్రభాత సేవ, ఆకు పూజ, సింధూర, స్వర్ణ వజ్రకవచలంకరణ చేశారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాలనుంచి భక్తాదులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.