TPT: చిత్తూరు బీటీ గ్రౌండ్లో స్కూల్ గేమ్స్ అండర్17 బాలబాలికల హాకీ జిల్లా జట్ల ఎంపిక పోటీలు బుధవారం జరిగాయి. కరకంబాడికి చెందిన ఎస్. యోగిని ప్రతిభ చూపడంతో ఆమెను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. నెల్లూరులో డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ వరకు జరిగే స్కూల్ గేమ్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో తమ కుమార్తె పాల్గొంటుందని తల్లిదండ్రులు తెలిపారు.