HYD: నగరంలోని అనేక హోటళ్లలో సర్వీస్ టాక్స్ పేరుతో అధిక వసూళ్లు జరుగుతున్నాయి. కేంద్ర వినియోగదారుల రక్షణ ప్రాధికార సంస్థ మార్గదర్శకాలకు విరుద్ధంగా పలు రెస్టారెంట్లు ఈ సర్వీస్ ఛార్జిని బిల్లుల్లో బలవంతంగా వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. బిల్లులు రూ. 5 వేల నుంచి రూ. 20 వేల వరకు రావడంతో వినియోగదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.