CTR: కుప్పం (M) ఆవుల నత్తం గేటు వద్ద రైలు కిందపడి 20 ఏళ్ల గుర్తుతెలియని యువతి ఆత్మహత్య చేసుకుంది. బుధవారం రాత్రి అశోకపురం ఎక్స్‌ప్రెస్ రైలు వస్తుండగా యువతి ట్రాక్‌పై అడ్డంగా నిలబడి ఆత్మహత్య చేసుకున్నట్లు లోకో పైలట్ కుప్పం రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు విచారణ చేపడుతున్నారు.