VSP: ఆనందపురం మండలం మామిడిలోవ హైవే ఆనుకోని ఉన్న సర్వీస్ రోడ్డులో బుధవారం జరిగిన యాక్సిడెంట్లో మహిళ మృతి చెందిన సంగతి తెలిసిందే. మృతురాలు ఆనందపురం మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన షినగం లక్ష్మి (58)గా గుర్తించారు. కాయగూరలు వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తుంది. తలకు బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.