KNR: జిల్లా కేంద్రంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నూతన కలెక్టరేట్ బిల్డింగ్ నిర్మాణ పనులను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. కార్యాలయం చుట్టూ చేపట్టిన మౌలిక సదుపాయాలను పర్యవేక్షించారు. వసతులు, సదుపాయాల కల్పనలో అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. పనులు వేగవంతంగా, నాణ్యతగా చేయాలని ఆదేశించారు.