GNTR: గుంటూరు నగరంలో ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను తడి, పొడిగా వేరు చేసి ఇవ్వాలని నగర కమిషనర్ శ్రీనివాసులు బుధవారం అదేశించారు. ప్రజలు ఇళ్లలో హోం కంపోస్ట్ తయారు చేసుకోవాలని సూచించారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లపై అనధికార మాంసం, చేపల విక్రయాలను నిషేధించారు. నిరుపయోగ వస్తువులను రోడ్లపై వేయకుండా, వాటిని ఆర్ఆర్ఆర్ (RRR) కేంద్రాలలో అందించాలని ఆయన ప్రజలను కోరారు.