PLD: పల్నాటి వీరుల ఉత్సవాలలో భాగంగా గురువారం “రాయబారం” కార్యక్రమం నిర్వహించనున్నారు. పల్నాటి యుద్ధంలో “రాయబారం” కీలక ఘట్టం. బ్రహ్మనాయుడు తమ రాజ్యాన్ని తిరిగి పొందేందుకు అలరాజును గురజాల రాజు నలగామరాజు వద్ద సంధికి రాయబారిగా పంపుతాడు. సందికి వెళ్లిన అలరాజును యుద్ధ నీతిని విస్మరించి ప్రత్యర్థులు చంపుతారు. ఆగ్రహించిన బ్రహ్మనాయుడు యుద్ధ ప్రకటన చేస్తారు.