ATP: రాప్తాడు మండల కేంద్రంలోని శివాలయంలో గురువారం కార్తీక అమావాస్య సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో స్వామివారికి ఆకు పూజ, బిల్వార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తాదులు ఆలయంలో పాలు, తేనె, బిల్వ పత్రాలు, నీటితో అభిషేకం చేశారు. ‘ఓం నమః శివాయ’ వంటి మంత్రాలను జపించి దీపారాధన చేశారు.