HYD: ఇవాళ హైదరాబాద్కు వైసీపీ అధినేత జగన్ రానున్నారు. అక్రమాస్తుల కేసులో విచారణ నిమిత్తం ఉదయం 10.30 గంటలకు నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో వ్యక్తిగతంగా హాజరుకానున్నారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకుంటారు. గతంలో కోర్టు వ్యక్తిగత హాజరు మినహాయింపును రద్దు చేయడంతో, ఆయన ఆరేళ్ల తర్వాత కోర్టుకు వస్తున్నారు.