SRD: శీతాకాలం రోడ్లపై వాహనదారులు జాగ్రత్తలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సిర్గాపూర్ ఎస్సై మహేష్ నేడు తెలిపారు. వేకువ జాములో పొగ మంచు వ్యాపించి ఉండడం వలన రహదారిలో వాహనాలు స్పష్టంగా కనబడకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందన్నారు. తప్పనిసరి అయితే తప్ప ఉదయం పూట ప్రయాణం చేయరాదని తెలిపారు. వాహనం హెడ్ లైట్ వేసి నడిపించాలన్నారు.