SKLM: కొత్తూరు (M) మెట్టూరు బిట్-1 డెప్పిగూడకు చెందిన ఇసాయి ధర్మారావు సవర ముఖలింగంలు నాటుసారా పాకెట్లతో పట్టుబడ్డారని కొత్తూరు ఎస్సై వెంకటేష్ తెలిపారు. బుధవారం నిర్వహించిన సాధారణ తనిఖీల్లో కొత్తూరు నుంచి హిరమండలానికి బైక్పై 50 నాటుసారా పాకెట్లతో వెళ్తుండగా, పోలీసులకు చిక్కారని చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకొని సారా పాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.