బిల్లుల ఆమోదం విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రాష్ట్రపతి, గవర్నర్కు గడువు విధించలేమని స్పష్టం చేసింది. రాష్ట్రపతికి గడువు విధించలేకపోయినా, గవర్నర్కు మాత్రం సూచనలు చేయగలమని కోర్టు పేర్కొంది. బిల్లు విషయంలో ఆమోదించడం, రాష్ట్రపతికి పంపడం, తిరిగి అసెంబ్లీకి పంపడం తప్ప గవర్నర్కు నాలుగో అధికారం ఏదీ లేదని SC స్పష్టం చేసింది.