KDP: ప్రొద్దుటూరు నియోజకవర్గం అభివృద్ధికి నిధులు ఇచ్చి సహకరిస్తున్నందుకు సీఎం చంద్రబాబుకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం రాత్రి కడప విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడుకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వరద మాట్లాడుతూ.. ప్రజల అభివృద్ధే కూటమి లక్ష్యం అని అన్నారు. ఇందులో భాగంగా పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.