GNTR: విశాఖలో ఈనెల 14, 15 తేదీలలో జరిగిన సీఐఐ పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు హాజరైన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ (ఏఎన్యూ) న్యాయ విద్యార్థులను వీసీ ఆచార్య గంగాధరరావు బుధవారం అభినందించారు. ఈ సదస్సులో 40 దేశాల నుంచి వచ్చిన పెట్టుబడిదారులు 12 రంగాలలో రూ.13.26 లక్షల కోట్ల విలువైన 613 ఒప్పందాలు చేసుకున్నట్లు విద్యార్థులు వీసీకి వివరించారు.