MDK: హవేలి ఘనాపూర్ మండలం జక్కన్నపేట గ్రామానికి చెందిన ఎల్లపురం మల్లవ్వ (52) అదృశ్యమైనట్లు పోలీసులు తెలిపారు. మతిస్థిమితం సరిగా లేక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు. గ్రామం నుంచి ఎటు వెళ్లిందో తెలవదని, ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు.