NGKL: ట్రాఫిక్కు అంతరాయం కలిగించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ సీరియస్ అయ్యారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారికి ఆనుకొని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగిస్తూ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సమస్య కారణంగా వాటిని గుర్తించి అందుకు తగిన చర్యలను చేపట్టారు.