BHPL: డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని డీఎస్పీ పి.రమేష్ కుమార్ అన్నారు. భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాలలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొని వారు మాట్లాడారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, నేర నియంత్రణ, న్యాయ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.