NLR: కందుకూరు పట్టణం పామూరు రోడ్-సింహాద్రి నగర్ మార్గంలోని కల్వర్ట్ స్లాబుపై రంధ్రం పడి ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో పలువురు జారి గాయపడిన ఘటనలు చోటుచేసుకున్నాయి. సిమెంట్ పలక తీసుకువచ్చి పక్కనే ఉంచిన మున్సిపల్ సిబ్బంది ఇంకా అమరిక చేయకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.