ప్రకాశం: ఏపీ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఇవాళ మార్కాపురం బాలికల ఉన్నత పాఠశాలలో జాబ్ మేళా నిర్వహించబడనుంది. ఈ విషయాన్ని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి రవితేజ తెలిపారు. ఇందులో భాగంగా పది బహుళ జాతీయ కంపెనీలు ఈ జాబ్ మేళాలో పాల్గొననున్నాయి. 18-35 ఏళ్ల మధ్య నిరుద్యోగులు ఈ అవకాశం వినియోగించుకోవాలని ఆయన సూచించారు.