AP: అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పల్లో ఆరుగురు మావోయిస్టులు హతమయ్యారు. అందులో హిడ్మా (సెంట్రల్ కమిటీ సభ్యుడు), రాజే (హిడ్మా భార్య, డివిజన్ కమిటీ మెంబర్), చెల్లూరి నారాయణ అలియాస్ సురేష్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. ఆపరేషన్ హిడ్మా పేరిట భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాయి.