VKB: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET)-2026ను జనవరి 3 నుంచి 31, 2026 వరకు నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థుల సౌకర్యార్థం వికారాబాద్ జిల్లా కేంద్రంలో పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర శాసనసభపతి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కోరారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డికి, విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రత్యేకంగా లేఖ రాశారు.