TG: ఉత్తర తెలంగాణ జిల్లాలను చలిగాలులు వణికిస్తోన్నాయి. 10 జిల్లాల్లో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. పటాన్చెరులో 9, మెదక్ 9.2, ఆదిలాబాద్ 10.4, హనుమకొండ, హయత్నగర్ 12.5, నిజామాబాద్ 13.4, రామగుండం, హకీంపేటలో 14.6, నల్గొండ, ఖమ్మం 15, మహబూబ్నగర్, భద్రాచలంలో 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పడిపోయాయి.