సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ఆధ్వర్యంలో గురువారం రాత్రి జలాల్ పూర్లో 24,72,696 శివ పంచాక్షర జప యజ్ఞం సంపూర్ణం చేసినట్లు విద్యాపీఠం నిర్వాహకులు తెలిపారు. కార్తీకమాసం చివరి రోజు సందర్భంగా వందలాది భక్తుల ఆధ్వర్యంలో శివ పంచాక్షరి విద్యాపీఠం బాధ్యులు మహేశ్వర శర్మ సిద్ధాంతి ఆధ్వర్యంలో మహోత్సవం విజయవంతంగా ముగిసిందన్నారు.