దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. నగరంలోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పటియాలా హౌస్, సాకేత్ కోర్టులు బెదిరింపుల జాబితాలో ఉన్నాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, బాంబు స్క్వాడ్స్తో కలిసి కోర్టు భవనాలను ఖాళీ చేయించి విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.