NTR: జగ్గయ్యపేటలో IPS రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు పట్టణంలోని యూనియన్ బ్యాంక్లో క్రైమ్ అవగాహన సదస్సు నిర్వహించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఆన్లైన్ పెట్టుబడులలో భాగంగా ఒకటి కన్నా ఎక్కువ బ్యాంక్ అక్కౌంట్స్ ఇచ్చి వాటిలోకి డబ్బు జమ చేయమని చెప్పడం తప్పకుండా మోసం అని అన్నారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.