NZB: రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన తోట గంగవ్వ అనే వృద్ధురాలు బుధవారం మృతి చెందింది. ఆమె కుటుంబ సభ్యుడు ప్రశాంత్ లయన్స్ క్లబ్ ఆఫ్ సభ్యులుగా కొనసాగుతున్నారు. అమ్మమ్మ నేత్రాలను దానం చేస్తే ఇద్దరి అందులకు కండ్లు చేయవచ్చునని సంకల్పంతో నేత్రాలను దానం చేశారు. ఆయనను లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ శ్యామ్ సుందర్, కార్య దర్శి ప్రశాంత్ గౌడ్ అభినందించారు.