చలికాలంలో రాత్రి భోజనానికి ముందు వేడివేడిగా క్యారెట్-అల్లం సూప్ తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. క్యారెట్, అల్లంతో పాటు ఇందులో ఉండే ఇతర సుగంధ ద్రవ్యాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ వంటి వాటి నుంచి రక్షిస్తాయి. ఈ సూప్‌లో కేలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అల్లం కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది.