MBNR: జిల్లా కేంద్రంలో 1993లో నిర్మించిన రైల్వే స్టేషన్ భవనాన్ని భాగంగా కూల్చి, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ స్టేషన్, అమృత్ భారత్ రైల్వే స్టేషన్ పథకంలో ఎంపికైనది. దీంతో ఒక వైపు భవనాన్ని కూల్చి కొత్త నిర్మాణాన్ని చేపట్టడం జరుగుతుంది. మరో వైపు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే సేవలు నడుస్తున్నాయి.