AP: పార్లమెంట్ సమావేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ మేరకు విజయవాడ ACB కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని సిట్‌కు ఆదేశించింది. మిథున్ రెడ్డి పిటిషన్‌పై తదుపరి విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. కాగా, ఏపీ మద్యం కేసులో మిథున్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు.