TG: రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కసరత్తు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా పంచాయతీల్లో ఓటర్ల జాబితా సవరణకు SEC షెడ్యూల్ను ప్రకటించింది. రేపటి నుంచి నవంబర్ 23 వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. ఈ సవరణ పూర్తయ్యాకే ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.