SRCL: చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామంలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్)లో తెలంగాణ ప్రభుత్వం తరపున మత్స్యకారులకు మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జలాశయంలో చేప పిల్లలను వదిలారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.