అన్నమయ్య: రైల్వే కోడూరులో ఇవాళ జరిగిన పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో DCMS ఛైర్మన్ జయప్రకాష్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడూరు నియోజకవర్గంలోని 24,622 మంది రైతులకు మొత్తం రూ. 16.50 కోట్లు వారి ఖాతాలలో జమ చేయబడ్డాయి. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు, సబ్సిడీలు అందిస్తూ వారికి అండగా ఉంటుందని జయప్రకాష్ తెలిపారు.