GDWL: గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్‌ఛార్జి బాసు హనుమంతు నాయుడు బుధవారం హైదరాబాద్‌లోని నంది నగర్ నివాసంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశాడు. ఈ సందర్భంగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురూ చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా కలిసి పనిచేయాలని కేటీఆర్ ఆయనకు సూచించారు.