VZM: సాంకేతికతను అందిపుచ్చుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని యువతకు జిల్లా ఎస్పీ దామోదర్ పిలుపునిచ్చారు. ఎస్.కోటలో శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో భాగంగా జరిగిన యువ సమ్మేళనం కార్యక్రమంలో బుధవారం పాల్గొన్న ఆయన, విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. మద్యం, గంజాయి వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని యువతను కోరారు.