ADB: ఆదివాసీలు తమ హక్కుల కోసం ఇప్పటికైనా ఏకమై పోరాడాలని తుడుందెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోడం గణేష్ అన్నారు. బుధవారం బేల మండల కేంద్రంలో ఆదివాసీ పెద్దలతో సమావేశమయ్యారు. ఆదివాసీల విద్య, వైద్యం, రిజర్వేషన్‌తో పాటు అనేక హక్కులను లంబాడీలు లాక్కుంటున్నారని ఆరోపించారు. దీన్ని పరిష్కరించేందుకు ప్రతిఒక్కరు పోరాడాలని పేర్కొన్నారు.