NRML: తక్షణమే సోయా కొనుగోలు కేంద్రాలను పునఃప్రారంభించాలని ముధోల్ రైతులు తహశీల్దార్ శ్రీలతకు బుధవారం వినతిపత్రం అందించారు. పీఎసీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 16న కేంద్రాలు ప్రారంభించినా, లారీలు లేవన్న కారణంతో మళ్లీ మూసివేసినట్లు తెలిపారు. జనవరి వరకు టోకెన్లు జారీ చేసిన నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు తిరిగి ప్రారంభించాలని కోరారు.