MNCL: లాటరీల పేరుతో జరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని మందమర్రి SI రాజశేఖర్ బుధవారం తెలిపారు. ఊరు రామకృష్ణాపూర్‌కు చెందిన ఓ వ్యక్తి యూట్యూబ్‌లో ప్రసారమైన ‘కేరళ లక్కీ డ్రా’ పేరుతో చేసిన మోసపు వీడియోను చూసి ఏకంగా రూ. 56,299/- పోగొట్టుకున్నట్లు తెలిపారు. ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామన్నారు.