గత కొన్ని రోజులుగా iBOMMA ఇమ్మడి రవి టాపిక్ SMలో ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో రవి జీవితం ఆధారంగా సినిమా చేయనున్నట్లు నిర్మాణ సంస్థ తేజ్ క్రియేటివ్ వర్క్స్ ప్రకటించింది. రవి జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలు, ఆయన చేసిన పోరాటం, ఎదుర్కొన్న ఇబ్బందులతో పాటు రవి.. అతని టీమ్ గురించి ప్రపంచానికి తెలియని విషయాల గురించి ఈ సినిమాలో చూపించబోతున్నట్లు తెలిపింది.