KMM: కొణిజర్ల జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లపై గత నెల రోజులుగా అక్రమంగా గొడ్డలి పోట్లు పడుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు బుధవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండానే వందలాది టన్నుల కలపను ఓ ఏజెన్సీ తరలించుకుపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.