MNCL: ఝాన్సీ లక్ష్మీబాయిని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని తాండూర్ MPDO శ్రీనివాస్, MEO మల్లేశం కోరారు. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు వీర వనిత చరిత్రను తెలుసుకోవాలని,చరవాణికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఉన్నత లక్ష్యం వైపు అడుగులు వేయాలన్నారు.