VKB: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల హాస్టల్ నుంచి పారిపోయిన ఇద్దరు విద్యార్థులను తాండూర్ పోలీసులు గంటల వ్యవధిలోనే పట్టుకున్నారు. విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో తాండూర్ పోలీసులు వేగంగా స్పందించారని DSP ఎన్.యాదయ్య తెలిపారు. తక్షణమే స్పందించి విద్యార్థులను పట్టుకున్న పోలీసుల అధికారుల బృందాన్ని DSP అభినందించారు.