MBNR: జిల్లా కేంద్రంలోని పాలమూరు యూనివర్సిటీలో బుధవారం జాతీయ ఔషధ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలమూరు యూనివర్సిటీ ఉపకులపతి జీఎన్ శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఫార్మసీ విద్యార్థులుగా సమాజం పట్ల వారి విధులను నిర్వహించాలని, వారికి వైద్యరంగంలో ముఖ్యపాత్ర ఉందన్నారు.