BDK: దమ్మపేట మండలంలో బుధవారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జిల్లా స్థాయి 69వ అండర్ 14,17,19 విభాగాల రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ పోటీలలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. అలాగే గట్టుగూడెం గ్రామంలో ఇటీవల మరణించిన కుటుంబాన్ని పరామర్శించారు. వారితో పాటు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.