KDP: నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఇవాళ కోరు కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. వైసీపీ పార్టీ బలోపేతం, పార్టీ అభివృద్ధి వంటి విషయాల గురించి అగ్ర శ్రేణి నాయకులు చర్చించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.