VSP: రైతుకు అండగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా తెలిపారు. తాటితూరులో అన్నదాత సుఖీభవ -పీఎం కిసాన్ రెండో విడత సాయాన్ని రైతులకు అందజేశారు. భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో 12 వేల మందికి రూ.8 కోట్లు జమయ్యాయని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర, పెట్టుబడి సాయం అందించడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.